News March 5, 2025

35 సార్లు విఫలమై.. ఎట్టకేలకు IASగా!

image

IAS కావాలన్నదే ఆయన కల. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 35 సార్లు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో విఫలమయ్యారు. ఆయనెవరో కాదు హరియాణాకు చెందిన విజయ్ వర్ధన్. UPSC 2018లో 104ర్యాంకుతో IPS, 2021లో 70 ర్యాంకు సాధించి IAS అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు. ఆత్మవిశ్వాసం ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తుందని ఈయన నిరూపించారు.

Similar News

News March 5, 2025

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిడమర్రు (మంగళగిరి) స్కూల్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో అందులో శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మార్చడమే లక్ష్యమన్నాయి.

News March 5, 2025

400 ఎకరాలు.. రూ.30వేల కోట్లు

image

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.

News March 5, 2025

IPL-2025లో కొత్త రూల్స్

image

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్‌లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

error: Content is protected !!