News May 10, 2024
వారి కాంట్రాక్ట్ తొలగించాలని అగార్కరే చెప్పారు: జైషా
BCCI సెక్రటరీ జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తొలగించాలని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కరే నిర్ణయించారన్నారు. కమిటీ నిర్ణయాలను అమలు చేయడమే తన పని అని చెప్పారు. WC తర్వాత రంజీల్లో ఆడాలన్న నిబంధనను శ్రేయస్, ఇషాన్ పట్టించుకోలేదు. దీంతో BCCI వారి కాంట్రాక్టును రద్దు చేసింది. కాగా శాంసన్ వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని జైషా తెలిపారు.
Similar News
News December 25, 2024
టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్(ITBP)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), 44 కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 18-25 వయస్సు, ఆసక్తి కలిగిన పురుషులు వచ్చే ఏడాది జనవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలని బోర్డు తెలిపింది. అదనపు వివరాల కోసం ఇక్కడ <
News December 25, 2024
తిరుమల పరకామణిలో కుంభకోణం?
AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.
News December 25, 2024
విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు
బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.