News May 10, 2024

వారి కాంట్రాక్ట్ తొలగించాలని అగార్కరే చెప్పారు: జైషా

image

BCCI సెక్రటరీ జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తొలగించాలని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కరే నిర్ణయించారన్నారు. కమిటీ నిర్ణయాలను అమలు చేయడమే తన పని అని చెప్పారు. WC తర్వాత రంజీల్లో ఆడాలన్న నిబంధనను శ్రేయస్, ఇషాన్ పట్టించుకోలేదు. దీంతో BCCI వారి కాంట్రాక్టును రద్దు చేసింది. కాగా శాంసన్ వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని జైషా తెలిపారు.

Similar News

News December 14, 2025

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇవాళ ప్రెస్‌మీట్‌లో మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీ రోల్‌లో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘రాజాసాబ్(JAN 9)’, శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి(JAN 14)’ కూడా ఉన్నాయి.

News December 14, 2025

అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

image

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.