News April 12, 2024

RCBలో దూకుడు కరవు.. ప్లేఆఫ్స్ కలేనా?

image

ఇప్పుడు RCB అభిమానుల్లో ఉన్నది ఒక్కటే సందేహం.. ఈసారి తమ అభిమాన జట్టు ప్లేఆఫ్స్‌‌కు చేరుతుందా? లేదా? ఇప్పటికే 6మ్యాచులు ఆడిన RCB కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఆ జట్టు మిగిలిన 8 మ్యాచుల్లో 7 మ్యాచులు గెలవాల్సిందే. లేకపోతే ప్లేఆఫ్స్ చేరడం కష్టం. ఇదిలా ఉంటే ఆ జట్టులో మునుపటి దూకుడు కనిపించడం లేదు. బ్యాటర్లు ఎంత స్కోర్ చేసినా.. బౌలర్ల చెత్త ప్రదర్శనతో ఓటమి తప్పడంలేదు.

Similar News

News January 16, 2026

మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

image

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.

News January 16, 2026

ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

image

PM మోదీ మరోసారి ట్రంప్‌కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.

News January 16, 2026

గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

image

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.