News May 18, 2024
ఇంపాక్ట్ ప్లేయర్పై రోహిత్ వాదనతో ఏకీభవిస్తున్నా: కోహ్లీ

ఐపీఎల్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను రోహిత్ శర్మతో ఏకీభవిస్తా. ఈ నిబంధన వల్ల ఆట సమతూకం దెబ్బతింటుంది. సీజన్ ముగిశాక దీనిపై బీసీసీఐ కార్యదర్శి జైషా సమీక్షిస్తారనుకుంటున్నా. కేవలం ఫోర్లు, సిక్సులు కాకుండా మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
వంటింటి చిట్కాలు

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో  ఇంగువ ముక్క ఉంచండి.
*  బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఫ్రిజ్లో పెట్టాలి. 
News November 4, 2025
RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 4, 2025
వాము పంట సాగు- అనువైన రకాలు

వాము పంటను ఏ నేలలోనైనా, ఏ వాతావరణంలోనైనా సాగు చేయవచ్చు. నల్లరేగడి నేలలో బాగా పండుతుంది. గుంటూరు లామ్ విడుదల చేసిన L.S-1, LTA-26, లామ్ వర్షా రకాలు మంచి దిగుబడినిస్తాయి. వాము పంటకాలం 150-160 రోజులు. వీటిలో లామ్ వర్షా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వాము పంట అధిక తేమ, నీటి ముంపును తట్టుకోలేదు. లోతట్టు నేలలు వాము సాగుకు అనుకూలం కాదు. మురుగునీటి వసతి ఉండాలి.


