News March 30, 2025
త్వరలో ‘అగ్రిగోల్డ్’ ఆస్తుల వేలం

AP: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుంది. 10L మంది బాధితులకు ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్‌కు 21,642 ఎకరాల భూములు, లక్ష చ.గజాల స్థలాలున్నాయి. వీటివిలువ 2012లో ₹3,869Cr కాగా ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ఆస్తులన్నీ CID ఆధీనంలోనే ఉన్నాయి.
Similar News
News April 17, 2025
ఈసారి ఐపీఎల్ టైటిల్ RCBదే: విలియమ్సన్

ఐపీఎల్-2025 విజేత ఎవరనేది న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ప్రిడిక్ట్ చేశారు. ఆర్సీబీ జట్టు ఈసారి కచ్చితంగా కప్ గెలుస్తుందన్నారు. ‘విరాట్ కోహ్లీ ప్రతి సీజన్‌లో అద్భుతంగా ఆడారు. ఈ ఏడాది కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తున్నారు. గేమ్ పట్ల హంగర్, ప్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. ఆర్సీబీకి కప్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది ఆ కల నెరవేరుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి మీరేమంటారు? COMMENT
News April 17, 2025
ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జులై నెల కోటా APR 19న ఉ.10 గం.కు విడుదల కానుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఎల్లుండి నుంచి 21వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22న ఉ.10 గంటలకు రిలీజ్ కానున్నాయి. జులై కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు 24న ఉ.10 గంటలకు, మ.3 గంటలకు గదుల కోటా రిలీజ్ కానుంది.
News April 17, 2025
IPL: వారి సరసన రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఒకే వేదికలో 100కు పైగా సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ(130), గేల్(127), డివిలియర్స్(118) వందకు పైగా సిక్సర్లు బాదారు. వాంఖడేలో రోహిత్ 102 సిక్సర్లు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(85) ఉన్నారు.