News April 11, 2024
టీనేజర్ల రక్షణ కోసం ఏఐ: మెటా

ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్టార్షన్/లైంగిక వేధింపులు నుంచి టీనేజర్లకు రక్షణగా ఏఐ టూల్ లాంచ్ చేయనున్నట్లు మెటా వెల్లడించింది. న్యూడిటీ ప్రొటెక్షన్ అనే టూల్ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. మెసేజింగ్ ద్వారా మైనర్లకు అసభ్యకర ఫొటోలు వస్తే వాటిని గుర్తించి బ్లర్ చేసేలా టూల్‌ను డిజైన్ చేస్తున్నట్లు వివరించింది. దీంతో యూజర్లకు అనవసర కంటెంట్ కనపడదని, వారికి ఆ ఇమేజ్ చూడాలా? వద్దా అనే ఛాయిస్ ఉంటుందని తెలిపింది.
Similar News
News November 9, 2025
ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో పనులను, టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.
News November 9, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 110 పోస్టులు

<
News November 9, 2025
మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>


