News May 10, 2024
మానవాళిని మోసం చేసే స్కిల్స్ AI సొంతం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే AI మనుషులను మోసం చేసే స్కిల్స్‌ను సాధించిందని తేలింది. ఆన్లైన్లో ‘prove you’re not a robot’ టెస్టును పరిష్కరించే నైపుణ్యాన్ని AI అభివృద్ధి చేసిందట. ఇలాంటి ఉదాహరణలు ప్రస్తుతం చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని సైంటిస్టులు వెల్లడించారు.
Similar News
News December 6, 2025
రిలేషన్షిప్లో ఈ తప్పులు చేస్తున్నారా?

దాంపత్య జీవితంలో చిన్న తప్పులు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచేస్తాయని రిలేషన్షిప్ కౌన్సిలర్స్ హెచ్చరిస్తున్నారు. ‘మీ పార్ట్నర్ మాట్లాడేటప్పుడు పట్టనట్లు ఫోన్ చూసుకోకండి. చిన్న విషయాలకు కూడా కేకలు వేయకండి. ఏ చిన్న పనైనా మీ పార్ట్నర్తో డిస్కస్ చేయకుండా మొదలు పెట్టకండి. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఏ రోజు డిఫరెన్సెస్‌ని ఆరోజే మాట్లాడుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది’ అని సూచిస్తున్నారు.
News December 6, 2025
నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.
News December 6, 2025
శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.


