News May 10, 2024
మానవాళిని మోసం చేసే స్కిల్స్ AI సొంతం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే AI మనుషులను మోసం చేసే స్కిల్స్‌ను సాధించిందని తేలింది. ఆన్‌లైన్‌లో ‘prove you’re not a robot’ టెస్టును పరిష్కరించే నైపుణ్యాన్ని AI అభివృద్ధి చేసిందట. ఇలాంటి ఉదాహరణలు ప్రస్తుతం చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని సైంటిస్టులు వెల్లడించారు.
Similar News
News February 18, 2025
27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

AP: గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న GOVT ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉ.గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
News February 18, 2025
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల

AP: మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఈరోజు ఉదయం 10 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపుల్ని ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
News February 18, 2025
నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.