News March 23, 2024

ఎన్నికల ప్రచారంలో ఏఐ హవా – 2/2

image

తమిళనాట దివంగత నేత కరుణానిధిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఆయనతో DMK ప్రచారం చేసుకుంది. రెండుగా చీలిన AIADMKలో పళనిస్వామి వర్గం తమకే ఓటేయాలని దివంగత నేత, ఆ పార్టీ మాజీ చీఫ్ జయలలితనే దింపింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేతలపై BJP, ప్రధాని మోదీపై కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలను షేర్ చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వాయిస్ క్లోనింగ్‌తో వారి పేర్లు పలికి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి.

Similar News

News September 11, 2024

BREAKING: జగన్ పాస్‌పోర్టు రెన్యూవల్‌కు హైకోర్టు ఆదేశం

image

AP: తన పాస్‌పోర్టు రెన్యూవల్ చేసేలా ఆదేశాలివ్వాలని వైసీపీ చీఫ్ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సంవత్సరాలకు పాస్‌పోర్టు రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన రూ.25వేల పూచీకత్తు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

News September 11, 2024

రుణమాఫీ సర్వే 50% పూర్తి.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని 4.24 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

News September 11, 2024

టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్

image

TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.