News February 4, 2025
AI అంటే HYD అనేలా ఏఐ సిటీ: మంత్రి శ్రీధర్ బాబు

TG: హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. AI అంటే HYD గుర్తుకువచ్చేలా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. యువతను AI నిపుణులుగా తీర్చిదిద్దేందుకు AI వర్సిటీని కూడా ఏర్పాటుచేస్తామన్నారు. హైటెక్ సిటీలో డిపాజిటరీ ట్రస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. అన్ని రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని తెలిపారు.
Similar News
News February 7, 2025
రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు TGలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉ.గోదావరి, కృష్ణా, GTR, TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLGలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
News February 7, 2025
ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.
News February 7, 2025
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.