News October 15, 2025
ఏటా లక్షమంది ఉద్యోగులకు AI శిక్షణ: TCS

IT దిగ్గజం TCS సంస్థ తమ ఉద్యోగులకు AIలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏటా లక్షమంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ CTO హారిక్ విన్ తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం AI టూల్స్‌తో ప్రయోగాలు, హ్యాకథాన్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి సంస్థ ఇలాగే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం TCSలో దాదాపు 5.93 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Similar News
News October 15, 2025
గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.
News October 15, 2025
రబీలో మేలైన ‘కంది’ రకాలివే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షం, నీటి సదుపాయాన్ని బట్టి రబీలో కందిని ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. TGలో WRG-65, WRG-53, WRG-255, TDRG-59, LRG-41, ICPL-87119, ICPH-2740, TDRG-4 రకాలు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 5-6KGలు విత్తుకోవచ్చని తెలిపారు. ఆఖరి దుక్కిలో 20KGల నత్రజని, 50KGల భాస్వరంను వేయాలి, పైరు 30-40 రోజుల మధ్యలో మరో 20KGలను పైపాటుగా వేయాలని సూచిస్తున్నారు.
#ShareIt
News October 15, 2025
ఈ అష్టకం చదివితే కష్టాలు దూరం

నమామీశ్వరం సచ్చితానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం|
యశోభియోలూఖలాద్దావమానం
పరామృష్ఠమత్యంతతో ధృత్యగోప్యా ||”
ఈ దామోదరాష్టకాన్ని రోజూ పఠిస్తే కృష్ణుడి కృప లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తుల బాధలు, పాపాలు తొలగి, స్వామివారి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. మోక్షానికి మార్గమైన ఈ స్తోత్ర పారాయణ కష్టాలను తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#SHLOKA<<>>