News January 3, 2025
దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?

TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 29, 2025
రక్షణ రంగంలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు

భారత రక్షణ రంగంలో అదానీ గ్రూప్ రూ.1.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి మానవరహిత, అడ్వాన్స్డ్ గైడెడ్ వెపన్స్, డ్రోన్లు, స్మార్ట్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించనుంది. AI ఆధారిత యుద్ధ సాంకేతికతతో సైనికుల ప్రాణాపాయాన్ని తగ్గించాలన్నది సంస్థ ఉద్దేశం. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ‘దృష్టి-10’ యూఏవీలు(Unmanned Aerial Vehicles) భారత నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.
News December 29, 2025
మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్లు, హార్మోన్లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.
News December 29, 2025
రష్యన్ ఆర్మీలో చేరిన భారతీయులు మృతి

ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యన్ ఆర్మీలో చేరిన భారతీయుల దుస్థితి కలచివేస్తోంది. పంజాబ్కు చెందిన జగ్దీప్ కుమార్ తన సోదరుడిని వెతుక్కుంటూ రష్యాకు వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత కీలక విషయాలను వెల్లడించారు. అక్కడ యుద్ధంలో కనీసం 10 మంది భారతీయులు మృతి చెందారని, మరో నలుగురి ఆచూకీ లేదన్నారు. ఉద్యోగాల పేరిట ఏజెంట్లు మోసం చేసి రష్యాకు పంపిస్తున్నారని.. అక్కడ బలవంతంగా ఆర్మీలో చేర్చారని ఆరోపించారు.


