News September 6, 2024

సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవు: కేంద్ర మంత్రి

image

TG: వరదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే <<14038049>>తీరుగా<<>> చూడాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు ప్రకటించామని వెల్లడించారు. ఇకపైనా అండగా ఉంటామని సెక్రటేరియట్‌లో సీఎంతో భేటీ సందర్భంగా హామీ ఇచ్చారు.

Similar News

News November 15, 2025

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.

News November 15, 2025

నాబార్డు నిధులతో 14 గోదాములు ఏర్పాటు

image

TG: మరో 14 గోదాములను రూ.140 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్నారు. వీటి సామర్థ్యం 1.40టన్నులు. నాగర్‌కర్నూల్ జిల్లా పులిజాల, KMR జిల్లా జుక్కల్, మహ్మద్‌నగర్, మాల్‌తుమ్మెద, KMM జిల్లా కమలాపూర్, వెంకటాయపాలెం, MDK జిల్లా ఝరాసంగం, SRD జిల్లా బాచుపల్లి, MHBD జిల్లా తోడేళ్లగూడెం, కొత్తగూడ, జగిత్యాల జిల్లా చెప్యాల, మల్యాల, జనగామ జిల్లా రామచంద్రగూడెం, పెద్దపల్లి జిల్లా ధరియాపూర్‌లో వీటిని నిర్మిస్తారు.

News November 15, 2025

గిల్ రిటైర్డ్ హర్ట్.. IND 3 వికెట్లు డౌన్

image

SAతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. సుందర్(29) అవుటవ్వగానే బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ తాను ఆడిన మూడో బంతికే ఫోర్ బాదారు. అయితే ఆ షాట్ కొట్టగానే ఆయన మెడ పట్టేసింది. కాసేపు నొప్పితో బాధపడ్డ గిల్ బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడారు. అతని స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరోవైపు భారత్ 109 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్(39) కూడా ఔట్ అయ్యారు.