News September 6, 2024
సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవు: కేంద్ర మంత్రి
TG: వరదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే <<14038049>>తీరుగా<<>> చూడాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు ప్రకటించామని వెల్లడించారు. ఇకపైనా అండగా ఉంటామని సెక్రటేరియట్‌లో సీఎంతో భేటీ సందర్భంగా హామీ ఇచ్చారు.
Similar News
News October 5, 2024
నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 5, 2024
ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.
News October 5, 2024
ధాన్యం సేకరణపై సీఎం కీలక నిర్ణయం
AP: ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.