News December 1, 2024
2030 నాటికి ఎయిడ్స్ రహిత ఏపీ: సీఎం

AP: 2030 నాటికి ఎయిడ్స్ అంతం లక్ష్యంగా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా ఈ ఏడాదికి ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ నినాదం ఇచ్చారు. ‘రాష్ట్రంలో 3.25 లక్షల మంది HIVతో బాధపడుతున్నారు. యువతలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 50కి.మీలోపు లింక్ ART కేంద్రాల్లో అవగాహన, చికిత్స అందించాలి. అందరికీ ఆరోగ్యం, గౌరవం ఇద్దాం’ అని భరోసా ఇచ్చారు.
Similar News
News February 16, 2025
నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.
News February 16, 2025
ప్రభాస్ లేటెస్ట్ PHOTO చూశారా?

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.
News February 16, 2025
CT-2025.. భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు

భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్‌లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్‌లో, లేకపోతే లాహోర్‌లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న NZతో తలపడనుంది.