News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 21, 2026
ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
News January 21, 2026
SHOCKING: ఒకే రోజు రూ.5వేలు పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.5,020 పెరిగి రూ.1,54,800కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,600 ఎగబాకి రూ.1,41,900 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 21, 2026
చీనీ, నిమ్మలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు (ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.


