News January 18, 2025

ఎయిర్ షో: నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎందుకంటే?

image

బెంగళూరు యెలహంకలో ఏరో ఇండియా 15th ఎడిషన్ షో FEB 10 నుంచి 14 వరకు జరగనుంది. దీంతో షో జరిగే 13KMల పరిధిలో మాంసం దుకాణాలు, నాన్ వెజిటేరియన్ హోటల్స్, రెస్టారెంట్స్‌ను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. JAN 23 నుంచి FEB 17 వరకు ఆ రూల్స్ అమల్లో ఉంటాయన్నారు. ‘చెత్తలో పడేసే మాంసాహారం పక్షులను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఎయిర్ షో సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్సుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.

News November 14, 2025

తేజస్వీ విజయం.. తేజ్ ప్రతాప్ పరాజయం

image

బిహార్ ఎన్నికల్లో మహా కూటమి CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘోపూర్ నియోజకవర్గంలో BJP నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్(-51,938 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రామ్‌విలాస్ అభ్యర్థి సంజయ్ కుమార్ సింఘ్ 44 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రెండో స్థానంలో RJD అభ్యర్థి ముకేశ్ కుమార్ నిలిచారు.