News January 18, 2025
ఎయిర్ షో: నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎందుకంటే?

బెంగళూరు యెలహంకలో ఏరో ఇండియా 15th ఎడిషన్ షో FEB 10 నుంచి 14 వరకు జరగనుంది. దీంతో షో జరిగే 13KMల పరిధిలో మాంసం దుకాణాలు, నాన్ వెజిటేరియన్ హోటల్స్, రెస్టారెంట్స్‌ను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. JAN 23 నుంచి FEB 17 వరకు ఆ రూల్స్ అమల్లో ఉంటాయన్నారు. ‘చెత్తలో పడేసే మాంసాహారం పక్షులను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఎయిర్ షో సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్సుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
News February 9, 2025
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.
News February 9, 2025
చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

తన కొడుకు నాగచైతన్యను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.