News November 3, 2024

చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్

image

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించారు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ముంబైలోని వాంఖడేలో అజాజ్ 23 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బోథమ్ (22-వాంఖడే) రికార్డును ఆయన బ్రేక్ చేశారు. వీరిద్దరి తర్వాత రిచీ బెనాడ్ (18-ఈడెన్ గార్డెన్స్), కర్ట్నీ వాల్ష్ (17-వాంఖడే) ఉన్నారు.

Similar News

News February 12, 2026

‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

image

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.

News February 12, 2026

TG CET హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 12, 2026

ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

image

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>