News September 8, 2024

రంగంలోకి అజిత్ దోవల్.. రష్యా పర్యటన ఖరారు!

image

NSA అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారానికై శాంతి ప్రయత్నాలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో PM మోదీ ఫోన్ సంభాషణ సందర్భంగా, తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం దోవల్ రష్యాలో పర్యటించి శాంతి ప్రయత్నాలపై చర్చిస్తారని మోదీ పేర్కొన్నట్టు తెలిసింది. బ్రిక్స్-NSA సమావేశంలో కూడా దోవల్ పాల్గొంటారని సమాచారం.

Similar News

News October 7, 2024

బతుకమ్మకు అమెరికాలో అరుదైన గౌరవం

image

తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ఈ పండుగను అధికారికంగా గుర్తించాయి. అంతే కాకుండా ఈ వారాన్ని హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తూ ఆ రాష్ట్రాల గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

News October 7, 2024

బీజేపీలో చేరిన పద్మశ్రీ గ్రహీత

image

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన కళాకారిణి దుర్గాభాయ్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితురాలై ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. స్వయంగా దుర్గాభాయ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. కాగా దుర్గాభాయ్ 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

News October 7, 2024

నిమ్మ రోజూ తినడం వల్ల ఉపయోగాలివే

image

నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఎక్కువ కాలరీలు ఖర్చై బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిమ్మలోని పీచు పదార్థం వలన పొట్ట నిండుగా అనిపించి జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అరుగుదల మెరుగుపరుస్తుంది. అనారోగ్యాలు దరిచేరవు’ అని వివరిస్తున్నారు.