News November 24, 2024
ఫ్లోర్ లీడర్‌గా అజిత్ పవార్ ఏకగ్రీవ ఎన్నిక
ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు అజిత్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బీజేపీ, శివసేన శాసనసభాపక్ష సమావేశాలు కూడా ఈరోజే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండడంతో సీఎం అభ్యర్థి ఎంపికపై కూటమి పార్టీలు త్వరితగతిన కసరత్తు చేస్తున్నాయి.
Similar News
News December 6, 2024
డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇంటర్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా నచ్చిన గ్రూప్‌లో డిగ్రీ చేసే అవకాశం కల్పించేందుకు UGC యోచిస్తోంది. డిగ్రీలో చదివిన కోర్సులతో సంబంధం లేకుండా విద్యార్థులకు పీజీ చేసే వీలు కల్పించనుంది. వర్సిటీ/జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్టులో పాసైన వారికి ఈ వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా మార్కులు తెచ్చుకున్నవారు నేరుగా డిగ్రీ రెండో, మూడో, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు.
News December 6, 2024
16,347 టీచర్ పోస్టులు.. BIG UPDATE
AP: 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. SC వర్గీకరణపై RR మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే <<14721880>>DSC<<>> ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
News December 6, 2024
రేపు నల్గొండలో లక్ష మందితో CM రేవంత్ సభ
TG: CM రేవంత్ రెడ్డి రేపు నల్గొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుండటంతో జిల్లా కేంద్రంలో లక్ష మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, గంధంవారిగూడెం వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల తదితర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.