News January 26, 2025
అజిత్‌కు ‘పద్మ భూషణ్’; కరెక్టా? కౌంటరా?

కోలీవుడ్ హీరో అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై తమిళనాట డివైడ్ డిస్కషన్ అవుతోంది. ఇది తగిన గౌరవమని తల ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇందులో BJP రాజకీయం ఉందని విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో MGR, కమల్ పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేషన్, రజినీకాంత్‌లకు ఇలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో పార్టీ ప్రకటించాక అజిత్‌కు అవార్డుతో కౌంటర్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.
Similar News
News February 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్‌కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.
News February 10, 2025
మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతి

TG: మహిళల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో అరెస్టైన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు అనుమతి కోరగా, 2 రోజులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13న మస్తాన్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
News February 10, 2025
SHOCKING: వాట్సాప్‌లో పెళ్లి.. పోలీస్ స్టేషన్‌లో యువకుడి రచ్చ

బిహార్ ముజఫర్‌పూర్‌లో అసాధారణ ఘటన జరిగింది. ఇంటర్ బాలికను వాట్సాప్‌లో పెళ్లాడినట్లు బాలుడు పేర్కొన్నాడు. నిఖా కబూల్ హై(పెళ్లి సమ్మతమేనా?) అనే మెసేజ్‌కు ఇద్దరూ 3సార్లు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పురాలేదు. పేరెంట్స్ నుంచి అధికారిక ఫిర్యాదు తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు ఎదురుచూస్తున్నారు.