News May 22, 2024
భారీ ధరకు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ OTT హక్కులు?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ OTT పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.95 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.


