News December 23, 2024
రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిటీ

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పేసర్ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చారు. ‘నెట్స్‌లో రోహిత్ మోకాలికి బంతి బలంగా తాకింది. నొప్పితో ఆయన కాసేపు విలవిల్లాడారు. ఆ తర్వాత ఐస్ ప్యాక్ పెట్టుకుని అరగంటపాటు రెస్ట్ తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26న భారత్, ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.
Similar News
News December 4, 2025
మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదు: పుతిన్

PM మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. భారత్‌పై సుంకాలతో US ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘భారత్ దృఢమైన వైఖరిని ప్రపంచం చూసింది. తమ నాయకత్వం పట్ల దేశం గర్వపడాలి’ అని India Today ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా-ఇండియా ద్వైపాక్షిక లావాదేవీల్లో 90% పైగా విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్ మోదీని కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
News December 4, 2025
‘స్పిరిట్’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్‌కు వెళ్లారు. డిసెంబర్ 5, 6న జరిగే ప్రీమియర్స్‌కు ఆయన హాజరవుతారు. డిసెంబర్ 12న ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ‘కల్కి 2898 AD’ ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయిన ప్రభాస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈసారి వారిని కలవనున్నారు. దీని కారణంగా ఇటీవల ప్రారంభమైన ‘స్పిరిట్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
News December 4, 2025
PG కన్వీనర్ కోటా మిగులు సీట్ల భర్తీకి అనుమతి

AP: PGCET-2025లో కన్వీనర్ కోటాలో మిగులు సీట్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. వర్సిటీలు, కాలేజీల్లోని M.A, M.Sc, M.Com తదితర PG సీట్లను సంస్థలు భర్తీచేసుకోవచ్చు. సెట్లో అర్హత సాధించకున్నా, ఆ పరీక్ష రాయకున్నా నిర్ణీత అర్హతలున్న వారితో సీట్లను భర్తీ చేయవచ్చంది. ఈ వెసులుబాటు ఈ ఒక్కసారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఇలా చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తించదని స్పష్టం చేసింది.


