News December 23, 2024

రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిటీ

image

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పేసర్ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చారు. ‘నెట్స్‌లో రోహిత్ మోకాలికి బంతి బలంగా తాకింది. నొప్పితో ఆయన కాసేపు విలవిల్లాడారు. ఆ తర్వాత ఐస్ ప్యాక్ పెట్టుకుని అరగంటపాటు రెస్ట్ తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26న భారత్, ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.

Similar News

News November 19, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

image

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.

News November 19, 2025

ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్‌ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.

News November 19, 2025

NTRలో 1,18,629 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

image

ఎన్టీఆర్ జిల్లాలో 1,18,629 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మరికొద్ది సేపట్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ నిధులు జమ కానున్నాయి. మొత్తం రూ.79.72 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.59.31 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.20.41 కోట్లు మంజూరు అవుతున్నట్లు స్పష్టం చేశారు.