News December 18, 2024
ఆకాశ్ దీప్.. రన్స్ కొత్త కాదు!
బ్రిస్బేన్ టెస్టులో ప్రస్తుతం క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ ఆఖరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ అతడి బ్యాటింగ్ మరీ అంత బలహీనమేమీ కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓ బ్యాటింగ్ రికార్డు ఆకాశ్ దీప్ పేరిటే ఉంది. 2021/22 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఝార్ఖండ్‌పై 18 బంతుల్లోనే 53 రన్స్ చేశారు. దీంతో అప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించారు.
Similar News
News January 26, 2025
ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News January 26, 2025
నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
News January 26, 2025
ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా: బాలకృష్ణ
తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు. NTR వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను. నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.