News October 15, 2024
ట్రెండింగ్‌లో అఖండ-2!
బాలయ్య, బోయపాటి కాంబోలో ‘BB4’ ప్రకటన రావడంతో ట్విటర్‌లో అఖండ-2 హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 2021లో విడుదలైన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో దాని సీక్వెల్‌నే వీరు తెరకెక్కించనున్నారని బాలయ్య ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ‘BB4’గా పిలుస్తున్న ఈ మూవీ ముహూర్తపు షాట్‌ను రేపు చిత్రీకరించనుండగా.. టైటిల్‌ను కూడా రేపే అనౌన్స్ చేస్తారని సమాచారం.
Similar News
News November 12, 2024
అవినీతి జరిగితే మోదీ ఏం చేస్తున్నారు?: KTR
TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.
News November 12, 2024
ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన రేపు ఉదయం మహారాష్ట్రకు వెళ్లి, పార్టీ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ తరహాలో ఆ రాష్ట్రంలోనూ ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని అఘాడీ రేవంత్‌ను కోరింది. దానిపై ఆయన అక్కడి నేతలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News November 12, 2024
రఘురామ పిటిషన్లపై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ
YS జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణను HYD నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.