News April 25, 2024
లోక్‌సభ బరిలో అఖిలేశ్ యాదవ్
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో అఖిలేశ్ ఆజాంఘడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్ నుంచి గెలుపొందారు. గతంలో కన్నౌజ్ స్థానం నుంచి డింపుల్ యాదవ్, ములాయం సింగ్ గెలుపొందారు.
Similar News
News September 18, 2024
అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?
AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
News September 18, 2024
దివాలా దిశగా ‘టప్పర్‌వేర్’
ప్లాస్టిక్ బాక్సుల తయారీలో దిగ్గజ సంస్థ టప్పర్‌వేర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ వారంలోనే దివాలా ప్రకటన చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కంపెనీ షేర్లు తాజాగా 57 శాతం పడిపోయాయి. 2019లో 40 డాలర్లకుపైగా ఉన్న షేర్ విలువ ప్రస్తుతం 0.51 డాలర్లకు పడిపోయింది. $700 మిలియన్లకుపైగా ఉన్న అప్పులను చెల్లించడం సాధ్యం కావట్లేదు. దీంతో రుణదాతలతో చర్చించి దివాలా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటోంది.
News September 18, 2024
SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్
TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్‌గా రిటైర్డ్ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్‌ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.