News December 9, 2024
Alarm Bells: ఫోన్లకు అతుక్కుపోతున్నారు
సంబంధాలు దెబ్బతినడానికి స్మార్ట్ ఫోన్ ప్రధాన కారణమని ఓ సర్వేలో తేలింది. 73% పేరెంట్స్, 69% పిల్లలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. గ్యాడ్జెట్స్‌ను వదిలి ఉండలేని పేరెంట్స్ 76% ఉంటే, పిల్లలు 71% ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్ల వినియోగాన్ని తగ్గించి ఆదర్శంగా నిలవకుండా, అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోనే విషయంలో తమ పిల్లల సామర్థ్యాలపై ఆందోళనగా ఉన్నట్టు సర్వే తేల్చడం గమనార్హం.
Similar News
News January 15, 2025
బ్యాక్ టు హైదరాబాద్
సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
News January 15, 2025
గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?
AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.
News January 15, 2025
40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉపకరిస్తున్న గ్యాస్, ఎనర్జీ సదుపాయాలే లక్ష్యంగా రష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంపనుంది.