News January 24, 2025

ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం

image

మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.

Similar News

News February 16, 2025

రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఇటీవల తాను చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనల వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను ముర్ముకు మోదీ వివరించారు. భారత్-అమెరికా, భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సంబంధాల సారాంశాలను ఆమెతో మోదీ పంచుకున్నారు.

News February 16, 2025

IPL.. తొలి మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరం!

image

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నారు. గత సీజన్‌లో స్లోఓవర్ రేటు కారణంగా పాండ్యపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఆ తర్వాత అతడు తొలి మ్యాచ్ ఆడనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 23న జరిగే మ్యాచ్‌కు బరిలోకి దిగరు. దీంతో MI తొలి మ్యాచ్‌కు ఎవరిని కెప్టెన్‌గా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌గా ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.

News February 16, 2025

ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయి: YCP

image

AP: చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై దాడి చేయించారని ఆరోపించింది. 83 ఏళ్ల వ్యక్తి అని కూడా చూడకుండా తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేశారని ట్వీట్ చేసింది. మరీ ఇంత నీచ రాజకీయాలా చంద్రబాబు? అని ప్రశ్నించింది.

error: Content is protected !!