News April 11, 2024

ALERT: 5 రోజులే ఛాన్స్

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ https://voters.eci.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 9, 2026

టాలెంట్‌కు పరీక్షలు కొలమానం కాదు: శ్రీధర్ వెంబు

image

టాలెంట్‌ను కొలవడంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ప్రమాణాలు కాదని ZOHO కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి అసాధారణ ప్రతిభను వీటి ద్వారా గుర్తించలేరని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ డ్యుమినిల్ ఎప్పుడూ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనలేదని, అయినా సత్తా ఏంటో చూపారని Meta AI మాజీ శాస్త్రవేత్త యాన్ లెకన్ ట్వీట్ చేశారు. యాన్ కామెంట్స్‌కు మద్దతుగా వెంబు ఈ విధంగా స్పందించారు.

News February 9, 2026

ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

image

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 9, 2026

APPLY NOW: NIT రాయ్‌పుర్‌లో ఉద్యోగాలు

image

<>NIT<<>> రాయ్‌పుర్‌ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి పీజీ, NET/M.Phill./PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000+DA, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000+DA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nitrr.ac.in