News August 21, 2024

ALERT: ఎంపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి!

image

ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన కల్పిస్తోంది. ఎంపాక్స్ సోకిన వారు 2-4 వారాల్లో కోలుకుంటారు. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నా, రోగి వాడిన బట్టలను వినియోగించినా వైరస్ అంటుకుంటుంది. ఎంపాక్స్ సోకినవారిలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, దగ్గు ఉంటుంది. జ్వరం వచ్చిన మూడురోజుల్లో దద్దుర్లు కనిపించి, 2-4 వారాలు ఉంటాయి.

Similar News

News September 16, 2024

‘అటర్ విచార్ మంచ్’ పేరుతో కొత్త పార్టీ

image

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్(AVM) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న ఝార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఐఏఎస్ అయిన యశ్వంత్ 1977లో బిహార్ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో రాజీనామా చేసి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

News September 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 16, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:34 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:17 గంటలకు
ఇష: రాత్రి 7.29 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.