News September 1, 2024

ALERT: వర్షాల్లో ఇవి అస్సలు చేయొద్దు: CS

image

TG: రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే వంతెనలు ఎక్కి చూడడం చేయవద్దన్నారు. ఆ సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకోవద్దని ఆమె కోరారు.

Similar News

News September 12, 2024

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ

image

కరోనా పుట్టిన చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోంది. దీన్ని వెట్‌ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. 2019లో దీన్ని తొలిసారి గుర్తించగా, ఇప్పుడు నెలలోనే 17 మందికి సోకింది. జంతువులలో రక్తాన్నీపీల్చే పురుగుల(ఓ రకమైన నల్లులు) ద్వారా మనుషుల్లో వ్యాపిస్తోంది. వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు కనిపిస్తాయని, తర్వాత మెదడు, నరాల సంబంధ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

News September 12, 2024

చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ

image

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్‌ టెండూల్కర్(623 ఇన్నింగ్స్‌) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.

News September 12, 2024

చంద్రబాబుతో కేంద్ర బృందాల భేటీ

image

ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సచివాలయంలో CM చంద్రబాబుతో భేటీ అయ్యాయి. వరద నష్టంపై తాము చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి CMకి వివరించాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. కాగా రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం నివేదిక అందించింది.