News September 2, 2024

ALERT.. బయటకు రావొద్దు: GHMC

image

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో GHMC అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. వాహనదారులు, పాదచారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరింది.

Similar News

News February 2, 2025

కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం

image

మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 2, 2025

తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్

image

*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్‌టైన్‌మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.

News February 2, 2025

వాణిజ్య పోరులో విజేతలు ఉండరు: చైనా

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై తమ ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా ఖండించింది. ‘వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించింది. మా దేశ హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు కచ్చితంగా అమెరికాకు తగిన విధంగా బదులిస్తాం’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.