News February 2, 2025

వాణిజ్య పోరులో విజేతలు ఉండరు: చైనా

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై తమ ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా ఖండించింది. ‘వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించింది. మా దేశ హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు కచ్చితంగా అమెరికాకు తగిన విధంగా బదులిస్తాం’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Similar News

News February 8, 2025

‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం

image

వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.

News February 8, 2025

వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.

News February 8, 2025

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)

error: Content is protected !!