News November 26, 2024
ALERT.. ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు

TG: నేటితో ముగియనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. డిసెంబర్ 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.100 అదనపు ఫీజుతో DEC 4-10, రూ.500తో DEC 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో DEC 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
Similar News
News November 22, 2025
బ్లడ్ గ్రూప్ డైట్ గురించి తెలుసా?

కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్ను బట్టి రక్తంలో చేరి అనారోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. A: పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా, టమాట, వంకాయ, గోధుమలు, జొన్న, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం

B:మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, బీన్స్ ఎక్కువగా, చికెన్, జొన్న, గోధుమ, టమాటా, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్లు, సోయా తక్కువగా తీసుకోవాలి. AB: కెఫిన్, ఆల్కహాల్, వేపుళ్లు తక్కువగా, పాల ఉత్పత్తులు, టోఫు, సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. O: వీరు అధిక ప్రొటీన్ తీసుకోవాలి. గోధుమ పిండి, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

యాషెస్: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 2 పరుగులకే ఓపెనర్ క్రాలే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్ సేన 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్సులో ENG 172 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే.


