News November 26, 2024
ALERT.. ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు
TG: నేటితో ముగియనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. డిసెంబర్ 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.100 అదనపు ఫీజుతో DEC 4-10, రూ.500తో DEC 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో DEC 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
Similar News
News December 8, 2024
చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’
భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డు సృష్టించింది. అలాగే హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల (₹131కోట్లు) రికార్డు నెలకొల్పింది. తొలి 2 రోజుల్లోనే ₹449cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా ₹120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూడో రోజు సౌత్(₹45cr) కంటే నార్త్‌లోనే(₹75cr) ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
News December 8, 2024
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా DEC 21
ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ వెల్లడించారు. భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో దేశాల బృందం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలిపారు. ‘సర్వజన శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవంగా జరుపుకునేందుకు భారత్ మార్గనిర్దేశం చేసింది’ అని పేర్కొన్నారు.
News December 8, 2024
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMC నీరు
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.