News November 14, 2024
CBSE విద్యార్థులకు అలర్ట్
వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.
Similar News
News December 8, 2024
యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం: జెలెన్‌స్కీ
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.
News December 8, 2024
విషాదం: వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో బాలుడు మృతి
TG: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వనపర్తి(D) బలిజపల్లి ZP హైస్కూల్‌లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. సీఎం కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ సాయి పునీత్(15) అనే టెన్త్ క్లాస్ బాలుడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News December 8, 2024
AUSvsIND: అమ్మాయిలూ ఓడిపోయారు!
ఈరోజు భారత్‌ను ఆస్ట్రేలియా రెండు వేర్వేరు మ్యాచుల్లో ఓడించింది. ఓవైపు అడిలైడ్ టెస్టులో గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిస్బేన్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల్ని ఆస్ట్రేలియా ఉమెన్ ఓడించారు. 372 రన్స్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ 44 ఓవర్లలో 249కి ఆలౌటైంది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.