News October 15, 2025

EPFO ఖాతాదారులకు అలర్ట్

image

PF అకౌంట్ ఉన్న వారు ఎక్కువకాలం ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరణ చేసుకునేలా EPFO సెంట్రల్ బోర్డు అనుమతిచ్చింది. ఏడాదిగా ఉద్యోగం లేని వారు EPF తుది పరిష్కారానికి, 3 ఏళ్లు ఉపాధి లేని వారు PF డబ్బుతో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు ఖాతాల్లోని నిధులను పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 18, 2026

పీఆర్సీపై సీఎం తక్షణమే ప్రకటించాలి: ఎస్టీయూ

image

నూతన పీఆర్సీపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.

News February 18, 2026

AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

image

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

News February 18, 2026

తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

image

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.