News June 3, 2024

గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్

image

AP: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచనలు చేసింది. అభ్యర్థులందరూ తమ పోస్ట్, జోనల్/జిల్లా ప్రాధాన్యతలను ఈ నెల 5 నుంచి 18 వరకు <>వెబ్‌సైట్‌<<>>లో సమర్పించాలని కోరింది. జులై 28న ఆఫ్‌లైన్ విధానంలో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

Similar News

News September 8, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

News September 8, 2024

నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ

image

వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.