News April 3, 2024
విద్యార్థులకు అలర్ట్!

పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ముద్రించి షాపులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 3& 6 తరగతుల కొత్త సిలబస్ పుస్తకాలు మే నెలలోపు ప్రచురిస్తామంది. 4, 5, 9 & 11 తరగతుల పుస్తకాలు ఈ నెలలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది.
Similar News
News March 19, 2026
EPF పెన్షన్ ₹1000 సరిపోదు: పార్లమెంటరీ ప్యానెల్

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద నెల వారీ పెన్షన్ కేవలం ₹1000 ఇస్తుండడాన్ని తక్షణమే సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. గౌరవప్రదమైన స్థాయిలో ప్రజల పెన్షన్లు ఉండాలని పేర్కొంది. కనీస పెన్షన్ ₹7,500 చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవనవ్యయం పెరిగినా అమౌంట్ మారలేదని.. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే విషయాన్ని పరిశీలించాలని కమిటీ పేర్కొంది.
News March 19, 2026
TODAY HEADLINES

✏ ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
✏ 2029లో BRS ఎలా గెలుస్తుందో చూస్తా: సీఎం రేవంత్
✏ తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు
✏ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు: షర్మిల
✏ డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం
✏ గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
✏ ఐపీఎల్: SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
News March 19, 2026
కమిన్స్ దూరం.. SRHకు బౌలింగ్ కష్టాలు?

IPL2026లో కొన్ని మ్యాచులకు కమిన్స్ దూరం కానున్నట్లు SRH ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో స్ట్రాంగ్ ఉన్న ఆ టీమ్ బౌలింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. కమిన్స్ లేకపోవడంతో మరింత బలహీనంగా మారింది. దీంతో పేస్ బాధ్యతలు ఉనద్కత్, హర్షల్, శివమ్ మావి మోయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వారు రాణించేది అనుమానమే. అటు స్పిన్నర్లలో అనుభవజ్ఞులు లేరు. దీంతో ఈసారి కూడా జట్టు భారం మొత్తం బ్యాటర్లే మోయాల్సి రావొచ్చు.


