News August 1, 2024
విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

TG: రెండో విడత కేటాయింపుతో కలిపి మొత్తం 81,490 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు దక్కాయి. ఇంకా 5019 సీట్లు మిగిలాయి. తాజాగా సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. అటు ఆగస్టు 8 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ జరగనుంది. రెండో విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారూ ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 13న సీట్లు కేటాయిస్తారు.
Similar News
News January 20, 2026
ఆయుష్షును పెంచే మహోద్దేశ సూత్రాలు

మంచి అలవాట్లు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
ఆభరణాలు ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది.
చక్కని దుస్తులు ధరిస్తే ముఖంలో తేజోమయం అవుతుంది.
ప్రసన్నంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నవ్వుతూ ఉంటే సంపద కలుగుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
ఇతరులకు సహాయపడితే క్షేమం కలుగుతుంది.
తృప్తిగా ఉంటే యవ్వనంగా ఉంటారు.
మధురంగా మాట్లాడితే అదృష్టం వరిస్తుంది.
మితంగా భుజిస్తే చక్కని రూపం సొంతమవుతుంది.
News January 20, 2026
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్ వస్తుంటుంది. మీకు లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 20, 2026
IIT రూర్కేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<


