News April 29, 2024
అలర్ట్: ఏపీలో 198 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని సూచించింది.
Similar News
News November 20, 2025
జనగామ జిల్లా ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

జనగాం జిల్లాలో PMDDKY అమలును ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జనగామ కలెక్టరేట్ వీసీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, నీటిపారుదల, పౌర సరఫరాలు, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ యోజన పురోగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు.
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.
News November 20, 2025
నటి మృతి.. అసలేం జరిగింది?

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.


