News April 29, 2024

అలర్ట్: ఏపీలో 198 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని సూచించింది.

Similar News

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It