News March 10, 2025
ALERT: ఈ ప్రాంతాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, పార్వతీపురం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని APSDMA అధికారులు తెలిపారు. రేపు 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.
Similar News
News March 10, 2025
చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.
News March 10, 2025
ఎన్టీఆర్-నెల్సన్ సినిమా టైటిల్ అదేనా?

తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో Jr.NTR ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.
News March 10, 2025
పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.