News March 10, 2025

ALERT: ఈ ప్రాంతాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, పార్వతీపురం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని APSDMA అధికారులు తెలిపారు. రేపు 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

Similar News

News February 9, 2026

500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

image

ప్రపంచంలోనే అతిపెద్ద ఇళ్లలో ఒకటిగా పేరొందిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ వడోదరాలో (GJ) ఉంది. 19వ శతాబ్దం చివరలో గైక్వాడ్ రాజకుటుంబం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిసోమ్ దీనిని డిజైన్ చేశారు. 500 ఎకరాలకు పైగా ఉండే ఈ ప్యాలెస్‌లో మ్యూజియంలు, గార్డెన్లు, రవి వర్మ పెయింటింగ్స్‌, గోల్ఫ్ క్లబ్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ రాజకుటుంబీకులు నివసిస్తున్నప్పటికీ పబ్లిక్‌ దీనిని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

News February 9, 2026

మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి కారణం ఇదే..

image

కడుపునిండా తిన్నా కూడా కొందరికి అర్ధరాత్రి ఆకలివేస్తూ ఉంటుంది. పడుకోలేక దొరికిన స్నాక్స్ తినేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్‌లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

News February 9, 2026

ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

image

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్‌ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.