News March 25, 2025
ALERT: వడగాలులు.. వర్షాలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.
Similar News
News April 19, 2025
త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి రాజనర్సింహ

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఎంపీ సురేశ్ శెట్కార్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.
News April 19, 2025
ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.
News April 19, 2025
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.