News August 31, 2024
ALERT.. ఇంటర్‌లో చేరేందుకు చివరి అవకాశం
TG: ఇంటర్‌లో చేరాలనుకునే వారికి విద్యాశాఖ చివరి అవకాశమిచ్చింది. వచ్చే నెల 7 వరకు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్ గడువును పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు మార్కుల మెమో, ఆధార్ కార్డు జిరాక్స్‌లు తప్పనిసరిగా అప్లికేషన్‌కు జత చేయాలని సూచించింది.
Similar News
News September 7, 2024
రూ.9 కోట్ల రాయి.. వాకిలి మెట్టుగా వాడిన బామ్మ
చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.
News September 7, 2024
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 181.. సెకండ్ ఇన్నింగ్స్‌లో డకౌట్
యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిరాశపర్చారు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-A, ఇండియా-B జట్లు తలపడుతున్నాయి. ఇందులో ఇండియా-B బ్యాటర్ ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 181 రన్స్ చేసి సంచలనంగా మారారు. దీంతో ఆ జట్టు 321 రన్స్ చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ప్రస్తుతం 33/3గా ఉన్న ఇండియా-B 123 రన్స్ లీడ్‌లో ఉంది.
News September 7, 2024
క్విక్ కామర్స్.. విగ్రహాలు, మామిడి ఆకులూ ఇందులోనే..
నగరాలు, పట్టణాల్లో క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో కొందరు వినియోగదారులు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ వినాయక చవితికి కావాల్సిన విగ్రహాలు, పత్రులు, పుష్పాలు, మామిడి ఆకులు, కుంకుమ.. ఇలా ప్రతి ఒక్క వస్తువును విక్రయించారు. వీటితో కిరాణాషాపులు, వీధి వ్యాపారులపై ప్రభావం పడుతోంది.