News February 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్‌కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.

Similar News

News March 24, 2025

అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

image

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్‌పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.

News March 24, 2025

రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే డకౌట్

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ డకౌటయ్యారు. ఈ టోర్నీలోనే అత్యధిక ధర(రూ.27కోట్లు) వెచ్చించి ఆయనను కొనుగోలు చేశారు. తొలి మ్యాచులో 6 బంతులు ఎదుర్కొన్న ఆయన సున్నాకే వెనుదిరిగారు. దీంతో రూ.27 కోట్లు పెడితే ఇలాగేనా ఆడేది అని పలువురు ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

News March 24, 2025

BREAKING: తండ్రైన స్టార్ క్రికెటర్

image

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ IPL మ్యాచ్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

error: Content is protected !!